logo

సచివాలయ ఉద్యోగులకు ఇక మంచి కాలమే..

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు, ఉద్యోగులకు నూతన ప్రభుత్వంలో మంచి రోజులు రానున్నాయి.  ఈ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తుందంటూ అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 13 Jun 2024 02:34 IST

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజన్‌రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న అంజన్‌రెడ్డి

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు, ఉద్యోగులకు నూతన ప్రభుత్వంలో మంచి రోజులు రానున్నాయి.  ఈ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తుందంటూ అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా అసోసియేషన్‌ కార్యవర్గ సమావేశాన్ని బుధవారం హిందూపురంలో నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నామని, తీవ్రమైన పని భారంతో ఇబ్బందులు పడ్డామన్నారు. రవాణా భత్యం ఇవ్వలేదని, కార్యాలయ నిర్వహణ వ్యయాన్ని తామే భరించామని వాపోయారు. సమస్యలను గత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోగా, మన సంఘాన్ని నాశనం చేయడానికి వైకాపా తొత్తు అయిన ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు వెంకటరామిరెడ్డి ప్రయత్నించారని విమర్శించారు. దీంతో అన్ని సమస్యలను గతం నుంచే తెదేపా యువనేత నారా లోకేష్‌కు వివరించామని, ఆయనకు సచివాలయ వ్యవస్థపై సమగ్ర అవగాహన ఉందని వివరించారు. సత్యసాయి జిల్లా అధ్యక్షుడు జయప్రసాద్, నాయకులు హరినాథ్, కవిత, శ్రీనివాసులు, హర్షవర్ధన్, అశ్వర్థప్ప, ప్రతాప్‌  పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు