logo

మంత్రులకు అభినందనల వెల్లువ

రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేసిన పయ్యావుల కేశవ్, సవితకు జిల్లా తెదేపా నాయకులు అభినందనలు తెలిపారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Published : 13 Jun 2024 02:36 IST

మంత్రి పయ్యావుల కేశవ్‌ను సన్మానిస్తున్న అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు
వెంకటశివుడు యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ మేయర్‌ స్వరూప

అనంతపురం (కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేసిన పయ్యావుల కేశవ్, సవితకు జిల్లా తెదేపా నాయకులు అభినందనలు తెలిపారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పయ్యావుల కేశవ్‌కు అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ మేయర్‌ స్వరూప, గాండ్ల కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ విశాలాక్షి శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. మరో మంత్రి సవితకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్, తదితరులు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి సవితకు మిఠాయి తినిపిస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత, తదితరులు

హిందూపురం అర్బన్, న్యూస్‌డే: కేసరపల్లి ఐటీ పార్కువద్ద మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అచ్చెన్నాయుడు, సవితమ్మలకు తెదేపా జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట వడ్డె అంజినప్ప శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయటం, మంత్రులుగా జిల్లా నుంచి ఇద్దరికి చోటు కల్పించడం ఎంతో శుభపరిణామం అన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడును సన్మానించిన శ్రీ సత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప


‘మొక్క’వోని దీక్ష

అనంతపురం (సిండికేట్‌నగర్‌): ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, రాప్తాడు ఎమ్మెల్యేగా పరిటాల సునీత గెలుపొందిన సందర్భాన్ని పురస్కరించుకొని అనంత గ్రామీణం రాచానపల్లి పంచాయతీ సిండికేట్‌నగర్‌లో తెదేపా నాయకులు ఓబులపతి ఆధ్వర్యంలో 300 మొక్కలు నాటారు. బుధవారం సిండికేట్‌నగర్, బీఎన్‌ఆర్‌ కాలనీ, ఈద్గా మైదానం, పరిటాల సునీత, పరిటాల రవీంద్ర కాలనీలలో తెదేపా, జనసేన నాయకులు మొక్కలు నాటి తమ అభిమానాన్ని చాటారు.  నాయకులు అంజి, లింగమయ్య, కిట్టా, రాజేశ్, రామకృష్ణ, లోకేశ్, నాగేంద్ర, సురేశ్, లక్ష్మీనారాయణ, ఇమామ్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని