logo

కూటమి సర్కారు.. సంబరాల హోరు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా, నారా లోకేశ్‌ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెదేపా, భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలు బుధవారం సంబరాలు జరుపుకొన్నారు.

Published : 13 Jun 2024 02:42 IST

రొద్దం మండలం బీదానపల్లిలో సీఎం చంద్రబాబు, మంత్రి సవిత చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న సర్పంచి, నాయకులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా, నారా లోకేశ్‌ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెదేపా, భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలు బుధవారం సంబరాలు జరుపుకొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, పట్టణాల్లో నాయకులు, ప్రజలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తెరపై వీక్షించారు. పలు చోట్ల డప్పు వాద్యాలతో నృత్యాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. బాణసంచా కాల్చి, కేకులు కోసి పంచిపెట్టారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెనుకొండ, ధర్మవరం ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం లభించడంతో స్థానికంగా నాయకులు సంబరాలు జరుపుకొన్నారు. అన్నదానం చేశారు. పుట్టపర్తిలో ఉద్యోగ, ఉపాధ్యాయులు చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేశారు. హిందూపురంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ధర్మవరం పట్టణంలోని క్రీడా మైదానం, బాలుర పాఠశాలలో తెరలు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. కదిరి పట్టణంలో కూటమి శ్రేణులు కోకులు కోసి, బాణసంచా కాల్చారు.  పెనుకొండ ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, చంద్రబాబు చిత్రపటానికి తెదేపా శ్రేణులు పాలాభిషేకం చేశారు. రొద్దం ఆంజనేయస్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. మడకశిర నియోజకవర్గంలోనూ సంబరాలు జరుపుకొన్నారు.

పుట్టపర్తిలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఉద్యోగులు

గోరంట్లలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆసక్తిగా వీక్షిస్తున్న ప్రజలు

ముదిగుబ్బలో కూటమి శ్రేణుల సందడి

పెనుకొండలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి, చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న తెదేపా శ్రేణులు

హిందూపురంలోని ఎన్టీఆర్‌ కూడలి సంబరాలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని