logo

కూటమి సర్కారు.. సంబరాల జోరు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా వ్యాప్తంగా తెదేపా కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఎక్కడికక్కడ టపాసులు కాలుస్తూ....కేకులు కోసి పంచారు. అంతటా పండగ వాతావరణం నెలకొంది.

Updated : 13 Jun 2024 04:40 IST

జిల్లా అంతటా పండగ వాతావరణం
45 చోట్ల ప్రత్యేక తెరలపై వీక్షణ

ఉరవకొండలో నినాదాలు చేస్తున్న తెదేపా శ్రేణులు

అనంతపురం (కళ్యాణదుర్గం రోడ్డు), జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా వ్యాప్తంగా తెదేపా కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఎక్కడికక్కడ టపాసులు కాలుస్తూ....కేకులు కోసి పంచారు. అంతటా పండగ వాతావరణం నెలకొంది. జిల్లావ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ తెరలపై వీక్షించారు. కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక ఎల్‌ఈడీ తెరలపై ఉదయం 10 గంటల నుంచే ప్రత్యక్ష ప్రసారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కలెక్టర్‌ తోపాటు జడ్పీ సీఈఓ నిదియాదేవి, అనంత నగర కమిషనర్‌ స్వరూప్, సహాయ కలెక్టర్‌ వినూత్న, అన్ని శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్‌లో తిలకించారు. నగర వ్యాప్తంగా ఉదయం 11.27 గంటలకు యువత కేరింతలు కొట్టారు. డప్పులతో హోరెత్తించి నృత్యాలు చేశారు. పలు చోట్ల ఎన్‌టీఆర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. రాంనగర్‌లోని మంత్రి పయ్యావుల కేశవ్‌ నివాసం వద్ద కార్యకర్తలు పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కళ్యాణదుర్గంలోని టీ కూడలిలో మహిళలు కేకు కోసి పంచిపెట్టారు.తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, కళ్యాణ దుర్గం నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.

కళ్యాణదుర్గం టీకూడలిలో కేకు కోసి సంబరాలు జరుపుకొంటున్న తెదేపా, భాజపా మహిళా నాయకురాళ్లు, సంఘాల సభ్యులు

అనంత నగరంలో ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద..

అనంతపురం: పయ్యావుల కేశవ్‌ నివాసం వద్ద బాణసంచా కాల్చుతున్న కార్యకర్తలు

కలెక్టరేట్‌లో ఎల్‌ఈడీ తెరపై వీక్షిస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్, అధికారులు

రాయదుర్గంలో తెదేపా శ్రేణుల సంబరాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని