logo

తాగునీటి సరఫరాలో వైకాపా నాయకుడి పెత్తనం

పంచాయతీ బోరు నుంచి తాగునీటిని సరఫరా చేయండలోనూ వైకాపాకు చెందిన ఓ నాయకుడి పెత్తనంతో 20 కుటుంబాలు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

Published : 21 Jun 2024 05:20 IST

తోపుడు బండిపై నీటిని తెచ్చుకుంటున్న వృద్ధుడు

తనకల్లు, న్యూస్‌టుడే: పంచాయతీ బోరు నుంచి తాగునీటిని సరఫరా చేయండలోనూ వైకాపాకు చెందిన ఓ నాయకుడి పెత్తనంతో 20 కుటుంబాలు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తనకల్లులోని జాతీయ రహదారి పక్కన సాయిబాబా ఆలయం లైన్‌లోని నివాసాలకు రెండు నెలలుగా నీటి సరఫరా కావడం లేదు. ఆ ఇళ్లకు చంద్రబాబునాయుడు కాలనీ, జాతీయ రహదారి పక్కన ఉన్న బోరు నుంచి పైప్‌లైన్‌ అనుసంధానం ఉంది. చంద్రబాబునాయుడు కాలనీకి నీటిని వదలరు. రహదారి పక్కన ఉన్న బోరు స్టార్టరుకు వైకాపా నాయకుడు తాళాలు వేసుకోవడంతో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. పలుమార్లు అధికారులకు తెలిపినా పరిష్కరిస్తామంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు. ఆ నాయకుడు వదిలినప్పుడు మాత్రమే నీరు వస్తాయని,  దీంతో ఎక్కడ నీళ్లు వస్తే అక్కడికి వెళ్లి తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నామని తెలిపారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తిరెడ్డిని వివరణ కోరగా సమస్య చాలారోజుల నుంచి ఉందని, పరిష్కరిస్తామని సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని