logo

కరవు జిల్లాను ఆదుకోండి

ఉమ్మడి జిల్లాలో గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రెండు సీజన్లలో పంటలు సాగు చేసి రైతాంగం తీవ్రంగా నష్టపొయింది. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.

Published : 21 Jun 2024 05:51 IST

కరవు బృందం సభ్యుడు పొన్నుస్వామికి
వినతిపత్రం అందిస్తున్న రైతు సంఘం నాయకులు

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రెండు సీజన్లలో పంటలు సాగు చేసి రైతాంగం తీవ్రంగా నష్టపొయింది. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. పశుపోషణ కష్టమైందని, కరవు నివారణకు రూ.10 వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు కోరారు. గురువారం అనంతపురం నగరంలో కరవు బృందం అధికారి పొన్ను స్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో నాలుగేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. 2019 నుంచి 2023 వరకు 268 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2023లో ఖరీఫ్‌లో 28 మండలాలు, రబీలో 14 మండలాలను కరవు కింద ప్రకటించారు. కరవు నివారణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయలేదన్నారు. ఆత్మహత్యల నివారణకు, జిల్లాలో రైతులు, రైతు కూలీలను ఆదుకునేందుకు తక్షణమే రూ.10 వేల కోట్లు ప్యాకేజీ ప్రకటించాలని ఆయన కోరారు. రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని, పంట నష్టపరిహారం కనీసం పదెకరాలకు ఇవ్వాలని, పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్లకు జీఎస్టీ రద్దు చేసి, ప్రతి రైతుకు 90 శాతం రాయితీతో పరికరాలు అందించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని