logo

వసతిగృహాలను బాగుచేయండి : కలెక్టర్‌

వసతి గృహాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Published : 21 Jun 2024 05:54 IST

వసతి గృహాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

తాడిపత్రి, న్యూస్‌టుడే : వసతి గృహాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తాడిపత్రిలోని సాంఘిక సంక్షేమ సమీకృత వసతీగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం, గదులకు తలుపులు, స్నానాల గదులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. పలు దస్త్రాలను పరిశీలించి కార్యాలయం ఐఎస్‌వో ప్రమాణాలతో ఉండాలన్నారు. అక్కడి నుంచి స్పెషల్‌ జ్యూడిషియల్‌ సెకెండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును తనిఖీ చేశారు. కోర్టు భవనానికి అవసరమైన మరమ్మతులను ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. సాంఘిక సంక్షేమ జేడీ మధుసూదనరావు, తహసీల్దార్‌ ఆంజనేయులు, ఏఎస్‌డబ్ల్యూవో పక్కీరయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని