logo

‘అక్షర యోధుడి ఆశయాలు కొనసాగిస్తాం’

నిత్య కృషీవలుడు, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభను గురువారం అనంతపురం ఈనాడు యూనిట్‌ కార్యాలయంలో నిర్వహించారు.

Updated : 21 Jun 2024 06:33 IST

బళ్లారి రోడ్డులోని మార్గదర్శి కార్యాలయంలో బ్రాంచ్‌ మేనేజరు గోపాలకృష్ణ, ఉద్యోగులు

ఈనాడు డిజిటల్, అనంతపురం: నిత్య కృషీవలుడు, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభను గురువారం అనంతపురం ఈనాడు యూనిట్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఈనాడు, ఈటీవీ, న్యూస్‌టుడేతోపాటు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని రామోజీరావు సేవలను స్మరించుకున్నారు. ఈనాడు అనంతపురం యూనిట్‌ మేనేజరు టి.శ్రీనివాసులు  ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి ఉద్యోగులంతా పుష్పాంజలి ఘటించి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన జీవితంపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. కృషినే నమ్ముకుంటూ పద్మవిభూషణ్‌ స్థాయికి ఎదిగిన తీరును గుర్తుచేసుకున్నారు. మార్పు నిత్యం.. మార్పు సత్యం అంటూ ఉద్యోగుల్లో ఆయన రగిల్చిన స్ఫూర్తిని స్మరించుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేలమందికి ఉపాధి కల్పించిన తీరును కొనియాడారు. మరణానికి ముందు ఆయన రామోజీ గ్రూప్‌ సంస్థల ఉద్యోగులకు రాసిన బాధ్యతల వీలునామాను గుర్తు చేసుకున్నారు. ఈనాడు అనంతపురం డెస్క్‌ ఇన్‌ఛార్జి సురేష్, కర్ణాటక డెస్క్‌ ఇన్‌ఛార్జి మహేశ్, ఈటీవీ స్టాఫ్‌ రిపోర్టర్‌ లక్ష్మీప్రసాద్, ఈనాడు స్టాఫ్‌ రిపోర్టర్‌ అంజప్ప, ఉపసంపాదకులు పాల్గొన్నారు.

  • అనంతపురం మార్గదర్శి కార్యాలయంలోనూ రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. బ్రాంచి మేనేజరు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది, ఖాతాదారులు నివాళులు అర్పించారు. మార్గదర్శి సంస్థను నిజాయితీతో నడిపిన తీరును ఉద్యోగులు గుర్తుచేసుకున్నారు. ఆయన నిబద్ధత కారణంగానే సంస్థ పారదర్శకతకు మారుపేరుగా నిలిచిందని కొనియాడారు. అకౌంటెంట్‌ మాధవి, యాక్ట్‌ సుబ్రహ్మణ్యం, డెవలప్‌మెంట్‌ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

అనంతపురం ఈనాడు యూనిట్‌ కార్యాలయంలో రామోజీరావు సంస్మరణ సభలో నివాళి అర్పిస్తున్న యూనిట్‌ మేనేజరు శ్రీనివాసులు, ఉద్యోగులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని