logo

Chittoor: వీళ్లింకా మారలేదంతే.. నవరత్నాల లోగోతో ధ్రువపత్రం జారీ

మండలంలోని అరగొండ సచివాలయంలో అధికారులు శుక్రవారం నవరత్నాలు లోగోతో 1బి ధ్రువపత్రం మంజూరు చేశారు. ప్రభుత్వం మారినా ఇంకా ఇలా మంజూరు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది.

Updated : 22 Jun 2024 08:24 IST

తవణంపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని అరగొండ సచివాలయంలో అధికారులు శుక్రవారం నవరత్నాలు లోగోతో 1బి ధ్రువపత్రం మంజూరు చేశారు. ప్రభుత్వం మారినా ఇంకా ఇలా మంజూరు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ సంఘటనపై పంచాయతీ కార్యదర్శి కల్యాణ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ఎన్నికల కోడ్‌ అమలులో వచ్చినప్పటి నుంచి పార్టీకి సంబంధించిన లోగో లేనివాటిని మంజూరు చేస్తున్నామన్నారు. శుక్రవారం అధికారుల సమన్వయ లోపంతో పొరపాటుగా నవరత్నాలు లోగో ఉన్న ధ్రువపత్రం ఇచ్చారన్నారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని