logo

చంద్రబాబు పర్యటనకు విస్తృత భద్రత

ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మొదటిసారి తిరుమల, తిరుపతి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఎస్పీ వి.హర్షవర్ధన్‌ రాజు, తితిదే సీవీఎస్‌వో నరసింహకిశోర్‌ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Updated : 12 Jun 2024 05:42 IST

తిరుమల, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మొదటిసారి తిరుమల, తిరుపతి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఎస్పీ వి.హర్షవర్ధన్‌ రాజు, తితిదే సీవీఎస్‌వో నరసింహకిశోర్‌ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి మీదుగా ఘాట్‌రోడ్డు, తిరుమలలోని గాయత్రీ అతిథిగృహం, వైకుంఠం క్యూకాంప్లెక్స్, శ్రీవారి ఆలయం వరకు రోడ్డు మార్గంలో తనిఖీలు చేశారు. అదనపు ఎస్పీ వెంకట్రావు, డీఎస్పీలు వెంకటాద్రి, భవ్యకిషోర్, రమణయ్య, డీఎస్‌డబ్ల్యూ, సీఐలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని