logo

రారండోయ్‌.. ప్రమాణ స్వీకారం చూద్దాం

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లాలో పండుగ వాతావరణం ఏర్పడింది. కలెక్టరేట్‌లోని కార్యాలయాల సముదాయాన్ని విద్యుదీపాలతో సుందరంగా అలంకరించారు.

Published : 12 Jun 2024 05:17 IST

చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ప్రత్యక్ష ప్రసారం

ముస్తాబైన చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లాలో పండుగ వాతావరణం ఏర్పడింది. కలెక్టరేట్‌లోని కార్యాలయాల సముదాయాన్ని విద్యుదీపాలతో సుందరంగా అలంకరించారు. ఇంకా గ్రామ స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు మండల, నియోజకవర్గ,  జిల్లా కార్యాలయాలు విద్యుదీపాల అలంకరణతో కళకళలాడుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లె గ్రామంలోని ఐటీ పార్క్‌ సమీపంలో జరిగే సీఎం ప్రమాణ స్వీకారాన్ని ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు జిల్లా స్థాయి కార్యక్రమాన్ని చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆడిటోరియంలో పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లు, టీవీలు, మైక్‌ సిస్టం ఏర్పాటు చేశారు. ప్రజలు కూర్చునేందుకు వీలుగా అదనపు కుర్చీలు ఏర్పాటు చేశారు. ఆడిటోరియంలో జరుగుతున్న ఏర్పాట్లను డ్వామా పీడీ రాజశేఖర్‌ పరిశీలించారు.

స్క్రీన్‌లో శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రం

విద్యుదీపాలంకరణలో కలెక్టరేట్‌


కలెక్టర్‌ సమీక్ష

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ షన్మోహన్‌ అన్నారు. ఏర్పాట్లపై మంగళవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


జిల్లా నుంచి 28 బస్సులు

చిత్తూరు నుంచి బయల్దేరిన బస్సు

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు జిల్లా నుంచి 28 బస్సులు బుధవారం రాత్రి ప్రయాణమయ్యాయి. ప్రతి నియోజకవర్గానికి 4 బస్సులు చొప్పున జిల్లా నుంచి ప్రజలు గన్నవరం బయల్దేరారు. ప్రతి బస్సుకి ఒక నోడల్‌ అధికారిని నియమించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక ప్రజల్ని తిరిగి అదే బస్సులో స్వస్థలాలకు చేర్చనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని