logo

ఆరని మంట, కమ్ముకుంటున్న పొగ

తడ మండలం మాంబట్టు పారిశ్రామికవాడలోని తిరుపతి రీసైక్లింగ్‌ ఇండస్ట్రీలో నిప్పంటుకున్న చెత్త ఇంకా రగులుతూనే ఉంది. ఎగసిపడుతున్న నల్లటిపొగతో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు, రాకపోకలు సాగించే కార్మికులు, ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Updated : 12 Jun 2024 05:40 IST

కాలుష్యంతో మాంబట్టు ప్రజల అవస్థలు

మాంబట్టులో రహదారి కనిపించనంతగా అలుముకున్న పొగ

తడ, న్యూస్‌టుడే: తడ మండలం మాంబట్టు పారిశ్రామికవాడలోని తిరుపతి రీసైక్లింగ్‌ ఇండస్ట్రీలో నిప్పంటుకున్న చెత్త ఇంకా రగులుతూనే ఉంది. ఎగసిపడుతున్న నల్లటిపొగతో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు, రాకపోకలు సాగించే కార్మికులు, ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పొగ పీల్చి ముక్కులు, గొంతులో మంట వస్తోందని మాంబట్టు పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెజ్‌ రోడ్డులో ఒకవైపు బ్యారికేడ్లను అడ్డుపెట్టి ఒన్‌వే ఏర్పాటు చేశారు. పొగతో మార్గం కనిపించక పట్టపగలు వాహన దారులు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు మంటలు వ్యాపిస్తాయోనని యాజమాన్యాలు సైతం భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి నాలుగు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం కనిపించలేదు. భారీ వర్షం కురిస్తే తప్ప మంటలు ఆగేలా లేవని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
్యగత మూడేళ్లగా రీసైక్లింగ్‌ ఇండస్ట్రీలో చెత్తను నిల్వ చేయడం తప్ప ప్లాస్టిక్, రబ్బరు, ఇతర వస్తువులను వేరు చేసే ప్రక్రియ చేపట్టలేదని స్థానికులు పేర్కొన్నారు. కేవలం ఇక్కడ డంపింగ్‌ యార్డుగానే వినియోగించి పోర్టులు, విమానాశ్రయాలు, పరిశ్రమల్లోని చెత్తను టన్నుల కొద్దీ తెచ్చి 20 అడుగుల మేర ఎత్తుతో పోగు చేసినట్లు తెలిపారు. చెత్తను వదిలించుకునే క్రమంలో నిప్పుపెట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మరో రెండు రోజుల వరకు చెత్త తగలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంటలను అదుపుచేసేందుకు సహకారం అందించకపోగా పాండిచ్చేరికి చెందిన సంబంధిత యజమాని షేర్‌ఆలీ పత్తా లేకుండా పోయారు. పోలీసులు ఫోన్‌చేస్తే తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు చెప్పాడని తెలుస్తోంది. పరిస్థితులను పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు