logo

అయోధ్యకాండ అఖండ పారాయణం

లోకకల్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ స్థానిక నాదనీరాజనం వేదికపై 11వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది.

Published : 12 Jun 2024 05:10 IST

తిరుమల, న్యూస్‌టుడే: లోకకల్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ స్థానిక నాదనీరాజనం వేదికపై 11వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. మంగళవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఆయోధ్యకాండలోని 40 నుంచి 44వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 159 శ్లోకాలు, యోగవాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 184 శ్లోకాలను పారాయణం చేశారు. ధర్మగిరి వేదపాఠశాల పండితులు డాక్టర్‌ రామానుజాచార్యులు, అనంత గోపాలకృష్ణ, మారుతి పాల్గొన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీనివాస్‌ బృందం శ్రీరామ సంకీర్తనలు భక్తులను అలరించారు. ఎస్వీ వేదవిశ్వవిద్యాలయం, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ వేదపారాయణదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం శాస్త్ర పండితులు, తితిదే అధికారులు, భక్తులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని