logo

ముగిసిన గంగమ్మ జాతర

స్థానిక సంతపేట సమీపంలోని తిమ్మసముద్రంలో గంగమ్మ జాతర వైభవంగా ముగిసింది. ప్రజలు ఊరేగింపుగా వచ్చి గంగమ్మకు సారెను సమర్పించారు.

Published : 13 Jun 2024 01:58 IST

చిత్తూరు(సంతపేట): స్థానిక సంతపేట సమీపంలోని తిమ్మసముద్రంలో గంగమ్మ జాతర వైభవంగా ముగిసింది. ప్రజలు ఊరేగింపుగా వచ్చి గంగమ్మకు సారెను సమర్పించారు. ఆపై అందరూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మేళతాళాలు, వాయిద్యాల నడుమ నిమజ్జన వేడుకలు ఘనంగా పూర్తిచేశారు. పాలసముద్రం: మండలంలోని శ్రీకావేరిరాజుపురం, బలిజకండ్రిగ గ్రామాల్లో రెండ్రోజులుగా గంగమ్మ జాతర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామ వీధుల్లో కూర్చొబెట్టి పూజలు చేపట్టారు.

అమ్మవారి ఊరేగింపుతో గ్రామస్థులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారికి పొంగళ్లు నైవ్యేదంగా పెట్టారు. జాతర కోలాహలంగా జరుపుకొన్నారు. బంగారుపాళ్యం: మండలంలోని తగ్గువారిపల్లెలో గంగ జాతర వైభవంగా జరిగింది. అమ్మవారి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేసి వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అమ్మవారికి అంబుళ్లు పోసి, పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. తెదేపా మండల ఉపాధ్యక్షులు లోకనాథ నాయుడు, సింగిల్‌ విండో మాజీ ఛైర్మన్‌ హేయచంద్రనాయుడు, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు జాకీర్, గ్రామ సర్పంచి ప్రియవాణి తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని