logo

పిల్లలు పనిలో కాదు.. బడిలో ఉండాలి

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని శిక్షణ సహాయ కలెక్టర్‌ హిమవంశీ పిలుపునిచ్చారు.

Published : 13 Jun 2024 02:20 IST

శిక్షణ సహాయ కలెక్టర్‌ హిమవంశీ

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని శిక్షణ సహాయ కలెక్టర్‌ హిమవంశీ పిలుపునిచ్చారు. స్థానిక గాంధీ విగ్రహ కూడలిలో జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్‌ ఓంకార్‌రావుతో కలిసి అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన అవగాహన ర్యాలీనీ ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాలతోనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరుగుతుందనుకోవడం సరికాదని, ప్రతిఒక్కరూ సంకల్పంతో కృషి చేస్తేనే సాధ్యమన్నారు. జిల్లాలో వంద శాతం బాల కార్మికులు లేకుండా చేయాలని, 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్ట వ్యతిరేకమన్నారు. పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు.  జిల్లా కార్మిక శాఖ ఇన్‌ఛార్జి అధికారి ఓంకార్‌రావు మాట్లాడుతూ ఈ నెల 30 వరకు బాల కార్మిక వ్యతిరేక మాసం(స్పెషల్‌ డ్రైవ్‌) నిర్వహిస్తున్నామన్నారు.  సహాయ కార్మిక అధికారి జగదీష్‌బాబు, ఛైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కో-ఆర్డినేటర్‌ నాగమణి, పిల్లల సంరక్షణ అధికారి శివకుమార్, పలువురు అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, కార్మికులు, పారా లీగల్‌ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు