logo

కోటి ఆశలతో.. కొలువుదీరిన వేళ

జగనాసుర పాలనతో రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా నవ్యాంధ్ర పరుగులిడేందుకు రంగం సిద్ధమైంది.

Published : 13 Jun 2024 02:40 IST

జిల్లా అంతటా పండగ వాతావరణం
ఉమ్మడి చిత్తూరు సమగ్రాభివృద్ధిపై ఆశలు
గతంలో ఆగిన ప్రాజెక్టుల్లో కదలిక
మౌలిక వసతుల విస్తరణకు నాంది
ఈనాడు డిజిటల్, తిరుపతి: గూడూరు, న్యూస్‌టుడే  

జగనాసుర పాలనతో రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా నవ్యాంధ్ర పరుగులిడేందుకు రంగం సిద్ధమైంది. చంద్రబాబు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు.. అభివృద్ధిపై ఆశలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2019కి ముందు తెదేపా హయాంలో చంద్రబాబు చేపట్టి.. నిలిచిన ప్రాజెక్టుల్లో నేడు కదలిక రానుంది. కీలకమైన ప్రాజెక్టులను వైకాపా పక్కన పెట్టడం ప్రజలకు శాపంగా మారినవేళ మళ్లీ తెదేపా అధికారంలోకి రావడంతో సమగ్రాభివృద్ధి సాకారం కానుంది. ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక విస్తరణకు విస్తృత వనరులు ఉండటం కలిసిరానుంది. 

రెండు పారిశ్రామిక నగరాలు..

 

కృష్ణపట్నం సమీపంలోని అంతర్జాతీయ పారిశ్రామిక నగరం క్రిస్‌ సిటీ పనుల్లో కదలిక రానుంది. ఇవి సీబీఐసీ, వీసీఐసీలో పనులు కాగా కేంద్రం నుంచి నిధులు రానున్నాయి. చిత్తూరు నోడ్‌ పనుల్లో కదలిక రానుంది. శ్రీకాళహస్తి సమీపంలోని ఏర్పేడు, బుచ్చినాయుడు కండ్రిగ ప్రాంతాల్లో పారిశ్రామిక నగరాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే రెండు ప్రాంతాల్లో రూ.1,540 కోట్ల పనులకు టెండర్లు పూర్తయ్యాయి.


విభజన హామీల్లోని దుగరాజపట్నం

రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా చట్టం చేసిన దుగరాజపట్నం పోర్టుకు హామీ దక్కనుంది. తొలిదశలో రూ.2,472 కోట్లు కేటాయించారు. దీనికి అనుసంధానంగా రైలు, రోడ్డు మార్గాలకు రూ.1,030 కోట్లు ఇవ్వగా భూసేకరణ ప్రక్రియకు రూ.270 కోట్లు కేటాయిస్తూ యూపీఏ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖ పోర్టు విస్తరణకు వీలుకాని నేపథ్యంలో దీనిని ప్రధాన పోర్టుగా నిర్మించడానికి వీలుంది. 


జలవనరుల ప్రాజెక్టుల్లో కదలిక

గిన ఆల్తూరుపాడు ప్రాజెక్టు, స్వర్ణముఖి- సోమశిల అనుసంధానం, హంద్రీనీవా సుజల స్రవంతివంటి అనే సాగునీటి ప్రాజెక్టులు దశలవారీగా పట్టాలెక్కనున్నాయి. నదుల అనుసంధాన ప్రాజెక్టులు రాష్ట్రాలను సస్యశ్యామలం చేయనున్నాయి. గోదావరి-కృష్ణా- పెన్నా ఇటు కావేరి నదుల అనుసంధానం చేపట్టాల్సి ఉంది. వీటిపై గతంలో చంద్రబాబు రాష్ట్ర పరిధిలో నివేదిక సిద్ధం చేశారు. వీటిని జాతీయస్థాయిలో ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు చొరవ తీసుకునే అవకాశం ఉంది. 


ఆహారశుద్ధి పరిశ్రమలు..

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మెగా ఫుడ్‌ పార్కులు, కోల్డ్‌ఛైన్, మౌలిక వసతులు, వ్యవసాయ శుద్ధి క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ పంటల్లో మామిడి, టమాటా, అరటి, బత్తాయి, చెరకు, బొప్పాయి వంటి పంటలు అధికం కాగా ఆయా రంగాల్లో వృద్ధి సాధించే వీలుంది. 


అధ్యాత్మిక, పర్యాటక ప్రాజెక్టులు. .

ఇందులో భాగంగా రోప్‌వే ప్రాజెక్టులు వచ్చే అకాశముంది. ఇప్పటికే తిరుపతిలో పర్వతమాల పరియోజన కార్యక్రమంలో రోప్‌వే ప్రతిపాదనలు ఉన్నాయి. శ్రీకాళహస్తిలో భరద్వాజతీర్థం శ్రీ దుర్గమ్మ కొండ దేవాలయం వయా కన్నన్న దేవాలయం వరకు రోప్‌వే ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. యర్రావారిపాలెం సిద్ధేశ్వరస్వామి ఆలయం నుంచి తలకోన జలపాతాల వరకు అంచనాలున్నాయి. 


నిరుద్యోగుల ఆశలవారధిగా..

త ఐదేళ్లూ నిరుద్యోగులు దగాపడ్డారు. జిల్లాలో 3,520 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ యువకులు అనేకమంది స్విగ్గీ బాయ్స్, రాపిడో డ్రైవర్లు, చిన్న పరిశ్రమల్లో కూలీలుగా మారారు. రూ.లక్షలు పెట్టి శిక్షణ తీసుకున్నా ఉద్యోగ ప్రకటన రాకపోవడంతో చివరకు కూలీలుగా మారారు.  నిరుద్యోగుందరికీ చంద్రబాబు ప్రభుత్వం ఊపిరిపోసింది. త్వరలో మెగా డీఎస్సీ రానున్న నేపథ్యంలో నిరుద్యోగులు పుస్తకాలకు పనిచెప్పారు.  


చేనేత క్లస్టర్లు 

జిల్లాలో కీలకమైన ఉపాధి పరిశ్రమం చేనత. జిల్లాలో పుత్తూరు, శ్రీకాళహస్తి, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో చేనేతరంగం విస్తరించింది. కొత్త ప్రభుత్వంలో చిల్లకూరు మండలం చింతవరంలో మాస్‌ ఫ్యాబ్రిక్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన టెక్స్‌టైల్స్‌ పార్కులో కదలిక వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 16 యూనిట్ల పరిధిలో రూ.1982 కోట్ల పెట్టుబడి అంచనాలు ఉండగా 581.80 ఎకరాల్లో వసతులకుగాను ఇప్పటికే రూ.24 కోట్లు వెచ్చించారు. సూళ్లూరుపేట సమీపంలోని తారకేశ్వర టెక్స్‌టైల్స్‌ పార్కు విస్తరణ పూర్తి కానుంది. వీటితోపాటు చేనేత రంగం వృద్ధిచెందే అనేక ప్రాజెక్టులు వరుసకట్టే అవకాశముంది.


వర్షాతిరేకాలు

- న్యూస్‌టుడే, తిరుమల   

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యులకు వర్షం స్వాగతం పలికింది. బుధవారం రాత్రి ఇక్కడకు చేరుకున్న వారికి తెదేపా నాయకులు,  కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. తెదేపా సీనియర్‌ నేత నరసింహయాదవ్, కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ, తిరుమల తెదేపా అధ్యక్షులు రాజు యాదవ్‌తోపాటు కార్యకర్తలు వారికి పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు