logo

ఎస్పీసీహెచ్‌లో గుండెమార్పిడి శస్త్రచికిత్స

 శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మరో గుండె మార్పిడి శస్త్రచికిత్సను శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.

Published : 15 Jun 2024 01:37 IST

గుండె ఉన్న బాక్సును తీసుకెళ్తున్న వైద్య బృందం  

తిరుపతి (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మరో గుండె మార్పిడి శస్త్రచికిత్సను శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. దీంతో గుండె మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్య 15కు చేరింది. కాకినాడ జిల్లాకు చెందిన యువకుడు (24) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి నాలుగునెలల కిందట వచ్చారు. వైద్యులు పరీక్షించి గుండెమార్పిడి అవసరమని గుర్తించి జీవన్‌ధాన్‌ ట్రస్టులో వివరాలు నమోదు చేశారు. వైజాగ్‌కు చెందిన వ్యక్తి (39) రోడ్డు ప్రమాదానికి గురై అక్కడి కిమ్స్‌లో బ్రెయిన్‌డెడ్‌ కావడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. అతని గుండెను ఎస్పీసీహెచ్‌లో ఉన్న యువకుడికి అమర్చవచ్చని గుర్తించిన వైద్యులు అవయవాన్ని సేకరించి వైజాగ్‌ నుంచి విమానంలో తిరుపతికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి గ్రీన్‌ఛానల్‌ ద్వారా తరలించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని