logo

ఎస్వీయూలో బోధనేతర ఉద్యోగుల అల్టిమేటం

ఎస్వీయూలోని బోధనేతర ఉద్యోగ సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ ఏకపక్ష నిర్ణయాలు, కక్ష సాధింపులకు ఊతం ఇచ్చేలా వర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు.

Published : 15 Jun 2024 01:48 IST

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: ఎస్వీయూలోని బోధనేతర ఉద్యోగ సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ ఏకపక్ష నిర్ణయాలు, కక్ష సాధింపులకు ఊతం ఇచ్చేలా వర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. ఈనెల 15లోపు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభించకపోతే జరిగే పరిణామాలకు ప్రస్తుత తాత్కాలిక కార్యవర్గమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని బోధనేతర ఉద్యోగులు స్పష్టం చేస్తూ ప్రస్తుత తాత్కాలిక కార్యవర్గానికి, వర్సిటీ అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. రాతపూర్వకంగా ఇప్పటికే ఉద్యోగులు వినతిపత్రం ఇవ్వడం వర్సిటీలో చర్చనీయాంశమైంది. ఆరేళ్లుగా అనధికారికంగా కొనసాగుతున్న ప్రస్తుత కార్యవర్గం వర్సిటీ అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించిందని, ఉద్యోగుల ఒత్తిడి మేరకు 2023 డిసెంబరులో సర్వసభ్య సమావేశం నిర్వహించి ఎన్నికలు జరపాలని తీర్మానించారని, అప్పట్లో ఎన్నికల అధికారిగా సహాయ పరిపాలనాధికారి షఫిని నియమించినట్లు వారు గుర్తుచేశారు. అయినప్పటికీ ఎన్నికల అధికారికి సహకరించకుండా సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని