logo

గణనాథుడి సేవలో సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని సినీ హీరో సాయిధరమ్‌తేజ్‌ శుక్రవారం దర్శించుకున్నారు.

Published : 15 Jun 2024 01:59 IST

వినాయకుడిని దర్శించుకున్న సాయి ధరమ్‌తేజ్‌ 

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని సినీ హీరో సాయిధరమ్‌తేజ్‌ శుక్రవారం దర్శించుకున్నారు. సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఇన్‌స్పెక్టర్‌ రమేశ్, అర్చకులు రాజగోపురం వద్ద ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం ఆయనకు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. పండితులు వేదాశీర్వచనం చేశారు. అతడిని చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని