logo

అనధికార తట్టలు, హ్యాకర్‌ లైసెన్సులు

తిరుమలలో తరతరాలుగా ఉంటున్న ప్రజలకు ఉపాధి కల్పించేందుకు గతంలో తితిదే తట్టలు, హ్యాకర్‌ లైసెన్సులు, దుకాణాలు కేటాయించింది.

Published : 15 Jun 2024 02:24 IST

తిరుమలలో స్థానికుల ఉపాధికి దెబ్బ

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో తరతరాలుగా ఉంటున్న ప్రజలకు ఉపాధి కల్పించేందుకు గతంలో తితిదే తట్టలు, హ్యాకర్‌ లైసెన్సులు, దుకాణాలు కేటాయించింది. కానీ కొంతమంది పలుకుబడితో గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు, తితిదేలోని కొన్ని విభాగాల సహకారంతో అనధికారికంగా వ్యాపారాలు ప్రారంభించారు. స్థానిక షాపింగ్‌ సమీపంలోని డీఎన్‌బీ రోడ్డు, వరాహస్వామి అతిథిగృహం వద్ద కొన్ని ఇతర రద్దీ ప్రాంతాల్లో అనధికార తట్టలు ఏర్పాటు చేశారు. తితిదే రెవెన్యూ టాస్క్‌ఫోర్స్‌ విభాగం అప్పుడప్పుడు నామమాత్రంగా దాడులు చేస్తుండటంతో పూర్తిస్థాయి నియంత్రణ కొరవడింది. అదే సమయంలో తితిదే విజిలెన్స్‌ విభాగం రోడ్డును ఆక్రమించి చేస్తున్న వ్యాపారాలను నియంత్రించలేకపోతోంది. ఇదే అదనుగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. దీనిపై తిరుమల స్థానికులు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు సైతం ఫిర్యాదు చేశారు. అనుమతిలేని, అక్రమంగా ఏర్పాటు చేసిన తట్టలు, హ్యాకర్‌ లైసెన్సులను తొలగించి స్థానికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


సీఎంకు ఫిర్యాదు చేశాం

తిరుమలలో స్థానికుల ఉపాధి కోసం తట్టలు, హ్యాకర్‌ లైసెన్సులను తితిదే కేటాయించింది. కొంత మంది నకిలీ పత్రాలతో  ఎక్కడ పడితే అక్కడ తట్టలు, దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో స్థానికంగా తితిదేకు అద్దె, విద్యుత్‌ బిల్లులు చెల్లించేవారు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ఆరణి శ్రీనివాసులుకు.. ఆయన ద్వారా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశాం. తితిదే ఉన్నతాధికారులు, తిరుమల రెవెన్యూ విభాగం, విజిలెన్స్‌ విభాగం అనధికార లైసెన్సులు తొలగించాలి.

- రాజుయాదవ్, తిరుమల తెదేపా అధ్యక్షుడు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు