logo

సగం పాఠశాలల్లో గుడ్డు పెట్టలేదు

పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందజేస్తున్నారు అందులో 1,200 పాఠశాలల్లో కోడిగుడ్డు పంపిణీ చేయగా 1,248చోట్ల గత రెండు రోజులుగా విద్యార్థులకు అందజేయలేదు.

Published : 15 Jun 2024 02:30 IST

ఇదీ మధ్యాహ్న భోజన పరిస్థితి

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందజేస్తున్నారు అందులో 1,200 పాఠశాలల్లో కోడిగుడ్డు పంపిణీ చేయగా 1,248చోట్ల గత రెండు రోజులుగా విద్యార్థులకు అందజేయలేదు. పాఠశాలలు పునఃప్రారంభం నుంచి మెనూ పక్కన పెట్టారు. అన్నం, ఆకుకూర, పప్పు కూర వడ్డించారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యాశాఖ ముందస్తు ప్రణాళిక కొరవడింది. మూడు రోజులు ముందుగా గుడ్ల పంపిణీ ఏజెన్సీని.. జిల్లాలోని పాఠశాలలకు సరఫరా చేయాలని కోరారు. హడావుడిగా చెప్పడంతో వారు అందుకు అవసరమైన కూలీలు, వాహనాలు సిద్ధం చేసుకోవడానికి సమయం చాలకపోవడంతో జిల్లాలోని సగం పాఠశాలలకే సరఫరా చేయగలిగారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పోషక విలువలు కలిగిన మధ్యాహ్న భోజనం అందజేసేందుకు త్వరలో మెనూ విడుదల చేయనుందని సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు