logo

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు రద్దు హర్షణీయం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేయడంపై చిత్తూరు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ ఆనంద్‌ యాదవ్, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

Published : 15 Jun 2024 02:33 IST

చిత్తూరులో సంబరాలు చేసుకుంటున్న న్యాయవాదులు  

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేయడంపై చిత్తూరు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ ఆనంద్‌ యాదవ్, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక హైరోడ్డులోని నూతన జిల్లా కోర్టు భవనాల సముదాయం ఎదుట చంద్రబాబునాయుడును అభినందిస్తూ శుక్రవారం సంబరాలు నిర్వహించారు. అశోక్‌ ఆనంద్‌ యాదవ్‌ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రైతులు, భూ యజమానులకు నష్టం తెచ్చిపెట్టే చట్టాన్ని తెచ్చిందన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని మూడు నెలల పాటు న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేస్తూ సంతకం చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు విశ్వనాధ్, సంఘం ప్రతినిధులు షఫీఉల్లా, లోకనాథన్, శ్రీనివాసులు, భూప్రసన్న, గోమతి, స్వరూపలక్ష్మి, సీనియర్‌ న్యాయవాదులు పి.చంద్రశేఖర్, పి.పి.రావు, సునీల్, సూర్యప్రకాష్, జ్యోతిరామ్, బాలాజీ, న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు