logo

శతాధిక వృద్ధురాలి మృతి

మండలంలోని వీరప్పల్లె పంచాయతీ మంగప్పల్లె గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మృతి చెందింది.

Published : 16 Jun 2024 02:06 IST

 వెంకటమ్మ (పాతచిత్రం)

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: మండలంలోని వీరప్పల్లె పంచాయతీ మంగప్పల్లె గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మృతి చెందింది. గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు గోపాల్‌రాజు మాతృమూర్తి కొండూరు వెంకటమ్మ(106) శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందారు. స్వగ్రామంలో శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు. వెంకటమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా మూడు తరాల పిల్లల్ని చూసిందని కుటుంబసభ్యులు చెప్పారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఓటు హక్కును వినియోగించుకుంది.


గుండెపోటుతో గణిత ఉపాధ్యాయుడు..

సురేష్‌బాబు

నిండ్ర: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు సురేష్‌బాబు(52) శనివారం విధి నిర్వహణలో తరగతి గదిలో కుప్పకూలి మృతి చెందారు. పాఠాలు బోధిస్తూ ఒక్కసారిగా పడిపోవడంతో సహచరులు ఆయన్ను 108 వాహనంలో నగరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. ఆ కుటుంబాన్ని  ఎమ్మెల్యేగా గెలిచిన గాలి భానుప్రకాష్, నిండ్ర, విజయపురం, నగరి మండలాల ఉపాధ్యాయులు పరామర్శించారు.


578 కేసులు.. రూ.12.93 లక్షల జరిమానా

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: విద్యుత్తు అక్రమ వినియోగంపై ఎస్‌పీడీసీఎల్‌ తిరుపతి సర్కిల్‌ పరిధిలో అధికారులు శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఎనిమిది డివిజన్ల పరిధిలో 3,095 సర్వీసులు తనిఖీ చేసి.. అక్రమంగా విద్యుత్తు వాడుతున్న 578 మంది సర్వీసుదారులపై కేసులు నమోదు చేశారు. రూ.12.93 లక్షల జరిమానా విధించామని ఉన్నతాధికారులు తెలిపారు. తిరుపతి అర్బన్‌ డివిజన్‌లో 98 సర్వీసులకు రూ.3.39 లక్షల జరిమానా విధించగా.. తిరుపతి రూరల్‌లో 65 సర్వీసులకు రూ.1.28 లక్షలు, పుత్తూరులో 93 సర్వీసులకు రూ.1.86 లక్షలు, చిత్తూరు అర్బన్‌ డివిజన్‌లో 49 సర్వీసులకు రూ.1.16 లక్షలు జరిమానా విధించారు. చిత్తూరు రూరల్‌లో 49 సర్వీసులకు రూ.0.86 లక్షలు, మదనపల్లె డివిజన్‌లో 98 సర్వీసులకు రూ.1.73 లక్షలు, పీలేరులో 62 సర్వీసులకు రూ.1.27 లక్షలు, పుంగనూరులో 64 సర్వీసులకు రూ.1.39లక్షలు జరిమానా విధించామని అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని