logo

హామీలు అమలుతో ప్రజలకు చేరువ చేస్తాం

దేశ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు పథకాలను అమలు చేస్తూ సంతకాలు చేయడం చరిత్రాత్మకమని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలుగా గెలిచిన జగన్మోహన్, మురళీమోహన్‌ పేర్కొన్నారు.

Published : 16 Jun 2024 02:07 IST

చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న గురజాల, మురళీమోహన్‌ తదితరులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ): దేశ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు పథకాలను అమలు చేస్తూ సంతకాలు చేయడం చరిత్రాత్మకమని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలుగా గెలిచిన జగన్మోహన్, మురళీమోహన్‌ పేర్కొన్నారు. తెదేపా కార్యాలయంలో శనివారం ఎన్టీఆర్‌ విగ్రహానికి నాయకులతో కలిసి నివాళులర్పించి, చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చిత్తూరులో ఈ నెల 17న అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తామని, నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు క్యాంటీన్లు ప్రారంభించనునామని గురజాల తెలిపారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో మఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారని, ముందుగా రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుగా మార్చాలని ఆదేశించారని చెప్పారు. మాజీ మేయర్‌ కఠారి హేమలత, చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సి.ఆర్‌.రాజన్, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్రకుమార్, కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని