logo

ముగిసిన తిరుపడి సిరి సంత

మహతి ఆడిటోరియంలో మూడురోజుల పాటు జరిగిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు శనివారంతో ముగిశాయి.

Published : 16 Jun 2024 02:10 IST

స్టాళ్లు ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ప్రతినిధులతో అధికారులు

తిరుపతి(వ్యవసాయం), న్యూస్‌టుడే: మహతి ఆడిటోరియంలో మూడురోజుల పాటు జరిగిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు శనివారంతో ముగిశాయి. తిరుపడి సిరి సంత పేరుతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యల ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించారు. నగరవాసులు ప్రకృతి విధానంలో పండించిన ఉత్పత్తులు, పర్యావరణ హిత ఆహార పదార్థాలు, చేనేత వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ముగింపు సమావేశంలో నాబార్డు ప్రాంతీయ స్థాయి అధికారి మహేష్‌ ప్రహాద్‌ సింగ్, డీడీఎం సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.   

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న నగరవాసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని