logo

నేడు తితిదే ఈవోగా శ్యామలరావు బాధ్యతల స్వీకారం

తితిదే కార్యనిర్వహణాధికారిగా జె.శ్యామలరావు బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 16 Jun 2024 02:10 IST

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే కార్యనిర్వహణాధికారిగా జె.శ్యామలరావు బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తితిదేను ప్రక్షాళన చేపడతామని ప్రకటించిన రెండో రోజునే ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న 1997 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శ్యామలరావును తితిదే ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని