logo

తోతాపురి మామిడి కాయల ధర పతనం

మామిడిలో సింహభాగం వాణిజ్య పంట తోతాపురి మామిడికాయలు ధరలు మార్కెట్‌లో రోజురోజుకు పతనమవుతున్నాయి.

Updated : 16 Jun 2024 05:52 IST

టన్నుకు రూ.5 వేల తగ్గింపు

బంగారుపాళ్యం, చిత్తూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: మామిడిలో సింహభాగం వాణిజ్య పంట తోతాపురి మామిడికాయలు ధరలు మార్కెట్‌లో రోజురోజుకు పతనమవుతున్నాయి. గడిచిన నాలుగురోజుల్లో టన్ను రూ.27 వేల నుంచి శనివారానికి రూ.22 వేలకు పడిపోయింది.సీజన్‌ ప్రారంభంలో టన్ను కాయలు రూ.27వేలకు అమ్ముడుపోయాయి. గత వారంలో పెనుగాలుల వర్షానికి రాలిపోయిన మామిడికాయలను వ్యాపారులు టన్ను రూ.27 వేలకు కొనుగోలు చేశారు. గడిచిన నాలుగు రోజుల్లో దినదినాకి ధర పతనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు సిండికెట్‌ అయి మామిడి ధరలను తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.కర్ణాకటలోని శ్రీనివాసపురం, తమిళనాడులోని క్రిష్ణగిరి ప్రాంతాల్లో పంట దిగుబడి ఆశాజనకంగా ఉందని, అక్కడ టన్ను కాయలు ధర రూ.20 వేలకు కొనుగోలు చేస్తున్నామని, ఇక్కడి కాయలకు మరో రూ.2వేలు పెంచి రూ.22 కొనుగోలు చేస్తున్నామన్నారు. గత ఏడాది అధిక దిగుబడి రావడంతో టన్ను కాయలు రూ.8 వేల నుంచి రూ.12వేలు మించలేదు. ఈ ఏడాది పంట దిగుబడి లేకపోయినా ఆశించిన ధరలు లేకపోవడంతో రైతులు భవిష్యత్తు అగమ్యచరంగా మారుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని