logo

అస్తవ్యస్త క్యూలైన్లతో అవస్థలు

శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులు అస్తవ్యస్త క్యూలైన్లల్లో అవస్థలు పడాల్సి వస్తోంది. వరుస సెలవుల కారణంగా సోమవారం మహాశివరాత్రిని తలపించే విధంగా భక్తులు తరలివచ్చారు.

Published : 18 Jun 2024 01:22 IST

శీఘ్రదర్శనం కౌంటర్‌ వద్ద నిరీక్షిస్తున్న భక్తులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులు అస్తవ్యస్త క్యూలైన్లల్లో అవస్థలు పడాల్సి వస్తోంది. వరుస సెలవుల కారణంగా సోమవారం మహాశివరాత్రిని తలపించే విధంగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. రాహు కాల సమయంలో రాహు, కేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూలైన్లు, పూజలు జరిగే మండపాలు కిక్కిరిసిపోయాయి.

గందరగోళం: మహద్వారం వద్ద వీలైనంత ఎక్కువ మందిని లోనికి పంపేయడం, దర్శనం పూర్తయిన వాళ్లను బయటకు తీసుకురాలేని కారణంగా ఆలయ ఆవరణలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు సంకట పరిస్థితులు ఎదుర్కొన్నారు. ప్రత్యేక, సర్వదర్శనం క్యూలైన్లల్లో ఎండ తీవ్రతకు తగ్గట్టుగా ఉక్కపోతతో సంకట పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. అమ్మవారి ఆలయం వద్ద యథేచ్ఛగా అంత్రాలయ దర్శనాలు అనుమతించడం కారణంగా సామాన్య భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 33 వేల మందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. రాహు, కేతు సర్పదోష నివారణ పూజా టికెట్లు 6588 జరిగాయి. రికార్డు స్థాయిలో శీఘ్రదర్శనం టికెట్లు 5680, ప్రత్యేక దర్శనం 3,050 టికెట్లు అమ్ముడుపోయాయి. వేసవి రద్దీ ఇంకా కొనసాగే అవకాశముంది. అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని