logo

శ్రీవారి భక్తులకు.. సంతృప్తికర దర్శనం కల్పించండ

శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించేలా తితిదే అధికారులు కృషిచేయాలని ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం ఇతర అధికారులతో కలిసి తితిదే విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు.

Published : 18 Jun 2024 01:37 IST

మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో తనిఖీ చేస్తున్న ఈవో జె.శ్యామలరావు 

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించేలా తితిదే అధికారులు కృషిచేయాలని ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం ఇతర అధికారులతో కలిసి తితిదే విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా, సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు. ముఖ్యంగా దర్శనం, వసతి, నాణ్యమైన అన్న ప్రసాదాలు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను అత్యున్నతంగా అందించడం మనందరి బాధ్యత అన్నారు. ఆదివారం తన తనిఖీలో పరిశీలించినప్పుడు భక్తుల నుంచి అందిన అభిప్రాయాలు, వారి అంచనాలు అందుకోవడానికి కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు.  దర్శనం, ఆన్‌లైన్‌ కోటా విడుదల ఆలయానికి సంబంధించిన సేవా టికెట్లు, రిసెప్షన్‌ విభాగంలో వసతి విధానాలు, ఇంజినీరింగ్‌ పనులపై సంబంధిత అధికారులో ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. 

తిరుమలలో రెండో రోజున తితిదే ఈవో పలు విభాగాల్లో తనిఖీ చేశారు. అన్నదానం కేంద్రంలో భక్తుల అభిప్రాయాలు స్వీకరించారు. వసతి గృహాలు, లడ్డూ కౌంటర్లను తనిఖీచేశారు. 

దుకాణదారులకు హెచ్చరికలు : శ్రీవారి భక్తులకు తితిదే నిర్ణయించిన ధరలకంటే అధిక ధరలకు విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తితిదే ఈవో హెచ్చరించారు. శ్రీనివాసమంగాపురం, శ్రీవారి మెట్టు మార్గంలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు కొంతమంది భక్తులు ఫిర్యాదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని