logo

పేదల ఆకలి తీరుస్తాం

అన్న క్యాంటీన్‌ ద్వారా రూ.5కే భోజనాన్ని అందించి పేదల ఆకలి తీరుస్తామని ఎమ్మెల్యేగా గెలిచిన గురజాల జగన్మోహన్‌ అన్నారు. చిత్తూరు నగరంలోని ఎస్టేట్‌ సమీపంలో అన్న క్యాంటీన్‌ను కలెక్టర్‌ షన్మోహన్, జేసీ శ్రీనివాసులుతో కలిసి ఆయన సోమవారం సాయంత్రం పునఃప్రారంభించారు.

Published : 18 Jun 2024 01:38 IST

అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్న గురజాల జగన్మోహన్, 
కలెక్టర్‌ షన్మోహన్, జేసీ శ్రీనివాసులు తదితరులు 

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: అన్న క్యాంటీన్‌ ద్వారా రూ.5కే భోజనాన్ని అందించి పేదల ఆకలి తీరుస్తామని ఎమ్మెల్యేగా గెలిచిన గురజాల జగన్మోహన్‌ అన్నారు. చిత్తూరు నగరంలోని ఎస్టేట్‌ సమీపంలో అన్న క్యాంటీన్‌ను కలెక్టర్‌ షన్మోహన్, జేసీ శ్రీనివాసులుతో కలిసి ఆయన సోమవారం సాయంత్రం పునఃప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి తక్కువ ధరకే పేదల కడుపు నింపడానికి తెదేపా ప్రభుత్వంలో ప్రారంభించిన ఈ క్యాంటీన్‌ను గత వైకాపా ప్రభుత్వంలో నిర్దాక్షిణ్యంగా మూసివేశారన్నారు. తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల్లో భాగంగా అన్న క్యాంటీన్‌ను పునఃప్రారంభించామని తెలిపారు. ఈ క్యాంటీన్‌ ద్వారా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పేదలకు నామమాత్రపు ధరకే ఆహారాన్ని అందిస్తామన్నారు. అనంతరం ఆయన అక్కడి అల్పాహారాన్ని రుచి చూశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్, మాజీ మేయర్‌ హేమలత, నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణ, తెదేపా నాయకులు సీకేసాయి కృష్ణారెడ్డి, వసంత్‌ కుమార్, గురజాల సందీప్, సుబ్రి, యువరాజులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని