logo

‘ధర్మారెడ్డి, భూమన అక్రమాలపై న్యాయ విచారణ చేయాలి’

మాజీ సీఎం జగన్‌ ప్రజా తీర్పును గౌరవించకపోగా తమ పార్టీ ఓటమిని ఈవీఎంలపై నెట్టడం సరికాదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి అన్నారు.

Published : 20 Jun 2024 05:22 IST

సమావేశంలో భాజపా నేత భానుప్రకాష్‌ రెడ్డి తదితరులు

తిరుపతి(భవానీనగర్‌), న్యూస్‌టుడే: మాజీ సీఎం జగన్‌ ప్రజా తీర్పును గౌరవించకపోగా తమ పార్టీ ఓటమిని ఈవీఎంలపై నెట్టడం సరికాదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. తితిదేలో ఎన్నడూ లేనివిధంగా వైకాపా నేతలు అక్రమాలు, దౌర్జన్యాలు, స్కాములతో తిరుమల ప్రతిష్ఠను దిగజార్చారన్నారు. తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి అక్రమాలు, అవినీతిపై న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌ పనుల్లో కరుణాకరరెడ్డి రూ.వందల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. వైకాపా పాలనలో జరిగిన తితిదే, టీడీఆర్, గంజాయి, ఎర్రచందనం ఇతర అన్ని అవకతవకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్‌ కల్యాణ్‌తో చర్చించి 5,380 టన్నుల ఎర్రచందనం నిల్వలపై విచారణ జరిపిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. భాజపా నేత వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని