logo

మమ్మల్ని అడ్డుకునేదెవరు..!

ప్రభుత్వం ఏదైతే మాకేంటి.. కొండైనా.. అడవైనా.. చెరువైనా.. కాలువలైనా ఆక్రమించేస్తాం.. మమ్మల్ని అడ్డుకునేది ఎవరన్నట్లు కబ్జాదారులు బరితెగిస్తున్నారు..

Published : 20 Jun 2024 05:27 IST

దర్జాగా ఆక్రమణ.. నిద్రపోతున్న యంత్రాంగం

కలికిరిండ్లకు సమీప ప్రభుత్వ భూమిని జేసీబీలతో చదును చేస్తున్న దృశ్యం

న్యూస్‌టుడే, కార్వేటినగరం: ప్రభుత్వం ఏదైతే మాకేంటి.. కొండైనా.. అడవైనా.. చెరువైనా.. కాలువలైనా ఆక్రమించేస్తాం.. మమ్మల్ని అడ్డుకునేది ఎవరన్నట్లు కబ్జాదారులు బరితెగిస్తున్నారు.. కార్యాలయాలకు సెలవుల సమయంలో, అధికారులు విధులకు హాజరుకాని వేళల్లో పొక్లెయిన్లతో కొండల్ని పిండిచేసి ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నారు.. గత ప్రభుత్వ పాలనలో ఆక్రమణలకు బరితెగించిన వైకాపా నాయకులు ప్రభుత్వం మారినా వాటిని కొనసాగిస్తున్నారు.. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల లోపు ఎవరికీ డీకేటీ పట్టాలు ఇవ్వడానికి అనుమతులు లేనప్పటికీ కబ్జాదారులు కళ్లెదుటే ఆక్రమిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

కార్వేటినగరం మండలంలోని ఆర్‌కేవీబీపేట పంచాయతీ పరిధిలోని కలికిరిండ్లు గ్రామానికి సమీప కార్వేటి నగరం లెక్క దాఖలాలో ప్రభుత్వ, అటవీ పోరంబోకు భూమిని కొందరు దర్జాగా కబ్జా చేస్తున్నారు. పొక్లెయిన్ల సహాయంతో కొండను పిండి చేసి ఆక్రమణలకు బరితెగిస్తున్నారు. ప్రభుత్వం మారినా కొందరు వైకాపా నాయకులు వెనుకాడటం లేదు. అధికారులందరూ మండల సముదాయానికి కూతవేటు దూరంలో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే చాలావరకు కబ్జా చేసేశారు. అదేమిటని అడిగే నాథుడే లేకపోవడంతో కబ్జాదారులదే రాజ్యంగా మారింది.


అక్రమార్కులపై చర్యలు
- పుష్పకుమారి, తహసీల్దారు, కార్వేటినగరం 

ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురువుతున్న విషయం నా దృష్టికి రాలేదు. వెంటనే పరిశీలించి కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని