logo

శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం

శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం బుధవారం కనులపండువగా ప్రారంభమైంది. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం ముగిసేటట్లు ఏటా మూడురోజులపాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు.

Published : 20 Jun 2024 05:41 IST

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి అభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు 

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం బుధవారం కనులపండువగా ప్రారంభమైంది. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం ముగిసేటట్లు ఏటా మూడురోజులపాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరించి మాడవీధుల్లోని భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శ్రీపెద్దజీయర్, శ్రీచిన్నజీయర్, ఈవో జె.శ్యామలరావు దంపతులు, డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు   పాల్గొన్నారు. 

వజ్రకవచంతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని