logo

సర్వదర్శనానికి 20 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొంత మేర తగ్గుముఖం పట్టింది. ఎటువంటి టైమ్‌స్లాట్‌ సర్వదర్శన టికెట్లు లేకుండా తిరుమల వచ్చిన భక్తులు బుధవారం సాయంత్రానికి వైకుంఠం

Published : 20 Jun 2024 05:45 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొంత మేర తగ్గుముఖం పట్టింది. ఎటువంటి టైమ్‌స్లాట్‌ సర్వదర్శన టికెట్లు లేకుండా తిరుమల వచ్చిన భక్తులు బుధవారం సాయంత్రానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని షెడ్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిసిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఆరు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి మూడు గంటల్లో దర్శనం లభించనుంది. మంగళవారం శ్రీవారిని 75,125 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.5541 కోట్లు హుండీ కానుకలు లభించాయి. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని