logo

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ బదిలీ

జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. సార్వత్రిక ఎన్నికల వేళలో కలెక్టర్‌గా పనిచేస్తున్న లక్ష్మీషాపై ఎన్నికల సంఘం బదిలీ వేటువేసింది.

Published : 20 Jun 2024 05:48 IST

తిరుపతి (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. సార్వత్రిక ఎన్నికల వేళలో కలెక్టర్‌గా పనిచేస్తున్న లక్ష్మీషాపై ఎన్నికల సంఘం బదిలీ వేటువేసింది. వైకాపా ప్రలోభాలను పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు రావడంతో ఆయన స్థానంలో ఏపీఐఐసీలో ఎండీగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ను కలెక్టర్‌గా నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఎన్నికలు పూర్తి చేసింది. దాదాపు రెండునెలలపాటు ఇక్కడి బాధ్యతలు నిర్వహించారు. తాజాగా మైనింగ్, జియాలజీ శాఖ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కలెక్టర్‌ నియమితులయ్యే వరకు జేసీ ధ్యానచంద్ర ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని