logo

తెప్పపై శ్రీపద్మావతీదేవి కటాక్షం

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అమ్మవారు శ్రీమహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 21 Jun 2024 04:00 IST

గజ వాహనంపై అమ్మవారు

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అమ్మవారు శ్రీమహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఐదు గంటలకు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చనలు చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని వేంచేపుగా పద్మసరోవరంలోని నీరాడ మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. ఆగమ శాస్త్రోకంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.  సాయంత్రం దివ్యాభరణ భూషితురాలైన శ్రీపద్మావతీ దేవిని తెప్పలపై కొలువుదీరి ఐదు పర్యాయాలు సరోవరంలో విహరించారు.

నేత్రపర్వంగా గజ వాహనసేవ: తెప్పోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన గజవాహనసేవ నేత్రపర్వంగా సాగింది. అమ్మవారు శ్రీమహాలక్ష్మిగా తనకు అత్యంత ఇష్టమైన గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు జనసందోహంగా మారాయి. వాహనసేవ దాదాపు గంటన్నర పాటు సాగింది.

నేడు గరుడ వాహనసేవ: అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా చివరిరోజు శుక్రవారం రాత్రి గరుడ వాహనసేవ జరగనుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం ప్రారంభం కానుంది. రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు గరుడ వాహనసేవ నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని