logo

ఒప్పంద ఉద్యోగి చేతివాటం

ఒప్పంద ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి ఏకంగా రూ.1.36 కోట్లు పక్కదారి పట్టించాడు. ఈ చిత్తూరు జిల్లా ఘటన పుంగనూరు మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో చోటుచేసుకుంది.

Published : 21 Jun 2024 04:18 IST

ఎంపీడీవో కార్యాలయంలో రూ.1.36 కోట్లు దుర్వినియోగం

సునీల్‌

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఒప్పంద ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి ఏకంగా రూ.1.36 కోట్లు పక్కదారి పట్టించాడు. ఈ చిత్తూరు జిల్లా ఘటన పుంగనూరు మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో చోటుచేసుకుంది. 2022-23, 24 ఏడాదిలో నిధులు దుర్వినియోగం చేయగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. పుంగనూరు మండల కార్యాలయంలో అప్పట్లో ఒప్పంద ఉద్యోగి సునీల్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తుండేవారు. బ్యాంకుల నుంచి జనరల్‌ ఫండ్‌ నిధులు ఉపసంహరించుకోవాలంటే సంబంధిత అధికారి వేలిముద్ర వేయాలి. అధికారులను ఏమార్చి సర్వర్‌ పనిచేయలేదంటూ సునీల్‌ పలుమార్లు అతని చరవాణి ద్వారా అధికారుల వేలిముద్రలు వేయించుకుని నిధులను తన, తన స్నేహితుడు మజ్జిగ మునిరామయ్య ఖాతాల్లోకి నిధులు  మళ్లించాడు. ఇలా రెండేళ్లలో రూ.1,36,61,668 పక్కదారి పట్టించాడు. నిధులు స్వాహా అయిన విషయమై ఏవో రాజేశ్వరి జూన్‌ 10న జడ్పీ సీఈవో గ్లోరియాకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని ఎంపీడీవో మునిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఎంపీడీవో ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ 2022-23, 24 ఏడాదిలో పనిచేసిన ఇన్‌ఛార్జి ఎంపీడీవోలు రాజేశ్వరి, నారాయణలకు ఈ నిధుల విషయమై మెమోలు జారీ చేసినట్లు చెప్పారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని