logo

టేబుల్‌ రకాలనే మండీలకు తరలించాలి

బంగినపల్లి, కాలేపాడు తదితర టేబుల్‌ రకాలతో పాటు తోతాపురి(కలర్‌) కాయలనే మండీలకు తరలించాలని ఉద్యాన శాఖ డీడీ మధుసూదనరెడ్డి గురువారం తెలిపారు.

Published : 21 Jun 2024 04:33 IST

 బంగినపల్లి టన్ను రూ.1.06 లక్షలు

 బంగినపల్లి కాయలు పరిశీలిస్తున్న డీడీ మధుసూదనరెడ్డి

చిత్తూరు (వ్యవసాయం): బంగినపల్లి, కాలేపాడు తదితర టేబుల్‌ రకాలతో పాటు తోతాపురి(కలర్‌) కాయలనే మండీలకు తరలించాలని ఉద్యాన శాఖ డీడీ మధుసూదనరెడ్డి గురువారం తెలిపారు. తోతాపురి ధరలు పెరుగుతున్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మండీలు, ర్యాంపు(సేకరణ కేంద్రాలు)లకు తోతాపురి కాయలు తరలించ రాదని, కేవలం ఫ్యాక్టరీ(గుజ్జు పరిశ్రమ)లకే తరలించాలని సూచించారు. బేన్నీషా, కాలేపాడు టేబుల్‌ రకాల మామిడి ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం తోతాపురి టన్ను రూ.26 వేల నుంచి రూ.28 వేలు పలుకుతోందని, త్వరలో ధర మరింతగా పెరగనుందని చెప్పారు. ఆయన బంగారుపాళ్యం యార్డులోని మామిడి మండీల్లో వ్యాపార లావాదేవీలు పరిశీలించారు.  బంగారుపాళ్యం యార్డులో బంగినపల్లి టన్ను ధర రూ.1.06లక్షలు పలికిందని డీడీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని