logo

సర్వదర్శనానికి 18 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు శుక్రవారం సాయంత్రానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లులో వేచి ఉన్నారు.

Updated : 22 Jun 2024 06:12 IST

తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు శుక్రవారం సాయంత్రానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లులో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 18 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 62,756 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.23 కోట్లు హుండీ కానుకలు లభించాయి. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది.

నేడు శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ.. తిరుమల: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన తితిదే గరుడసేవ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని