logo

నిధులకు నిరీక్షణ

గత ప్రభుత్వం ఆర్భాటంగా తీసుకొచ్చిన గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను ఆ ప్రభుత్వమే గాలి కొదిలేసింది. నిర్వహణకు నిధులు లేకపోవడంతో స్థానిక సంస్థలపై ఆర్థిక భారం పడుతోంది.

Published : 22 Jun 2024 04:14 IST

సచివాలయాల నిర్వహణకు నెలకు రూ.5 వేల దాకా ఖర్చులు

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: గత ప్రభుత్వం ఆర్భాటంగా తీసుకొచ్చిన గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను ఆ ప్రభుత్వమే గాలి కొదిలేసింది. నిర్వహణకు నిధులు లేకపోవడంతో స్థానిక సంస్థలపై ఆర్థిక భారం పడుతోంది. సచివాలయాలను ప్రారంభించినప్పుడు నెలకు రూ.5 వేలు నిర్వహణ నిధులుగా జమ చేస్తామన్నారు. తీరా అవి ఏర్పడిన ఆరు నెలల తర్వాత స్టేషనరీని ప్రభుత్వమే సరఫరా చేస్తుందని చెప్పి నిర్వహణ కోసం మూడు నెలలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించారు. అప్పటికే బకాయిలు పేరుకుపోయిన సచివాలయాలకు 2023లో కొంత మొత్తాన్ని నామమాత్రంగా ఇచ్చారు. ఇది జరిగి ఏడాది గడిచింది. స్టేషనరీ, ఇతర అవసరాలకు నిధుల కోసం స్థానిక సంస్థలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

సాధారణ నిధులే దిక్కు..

సచివాలయాల్లో ఏ పని చేయాలన్నా స్థానిక సంస్థల్లో ఉండే సాధారణ నిధులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రింటర్లు, సామగ్రి, అంతర్జాలం, విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, పథకాల లబ్ధిదారుల జాబితా ప్రింట్లు.. ఇలా నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా 543 రకాల సేవలు అమలు చేశారు. ఏ ధ్రువపత్రం కావాలన్నా సచివాలయాలకు వెళ్లి.. నిర్ణీత రుసుము చెల్లించాలి. అలా వచ్చిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు సిబ్బంది జమచేయాలి. సేవా రుసుముల ద్వారా వచ్చిన నగదు జమ చేస్తున్నా.. నిర్వహణకు గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని