logo

సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

సీఎం నారా చంద్రబాబు కుప్పం పర్యటనకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్‌ షన్మోహన్, జేసీ శ్రీనివాసులు, అన్ని శాఖల అధికారులు కుప్పంలో పర్యటించారు.

Published : 22 Jun 2024 04:16 IST

సభాస్థలిని పరిశీలించిన జిల్లా అధికారులు 

కుప్పం ఎన్టీఆర్‌ కూడలిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ షన్మోహన్, జేసీ శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం 

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: సీఎం నారా చంద్రబాబు కుప్పం పర్యటనకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్‌ షన్మోహన్, జేసీ శ్రీనివాసులు, అన్ని శాఖల అధికారులు కుప్పంలో పర్యటించారు. ఆర్టీసీ బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బహిరంగ సభా స్థలాన్ని, వాహనాల పార్కింగ్, రూట్‌ మ్యాప్‌ ఏర్పాట్లు పరిశీలించారు. బహిరంగ సభా స్థలం వద్ద ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో కలెక్టర్‌ సమీక్షించారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం పాల్గొన్నారు.

ప్రాథమికంగా పర్యటన ఇలా..

25న బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. పీఈఎస్‌ ఆడిటోరియంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షిస్తారు. ఆపై తెదేపా నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. 26న ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ప్రజల వినతులు స్వీకరిస్తారు. శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లె వద్ద హంద్రీ-నీవా కాలువ పరిశీలిస్తారు. కుప్పంలో నాయకులు, కార్యకర్తల సమావేశం పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని