logo

ముఖ్యమంత్రి పర్యటన ఖరారు

ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఈనెల 25, 26 తేదీల్లో ఖరారైంది. ఈ నేపథ్యంలో పర్యటన విజయవంతానికి యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది.

Published : 23 Jun 2024 02:21 IST

కుప్పం, చిత్తూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఈనెల 25, 26 తేదీల్లో ఖరారైంది. ఈ నేపథ్యంలో పర్యటన విజయవంతానికి యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. కుప్పం మున్సిపాలిటీతో పాటు శాంతిపురం మండలంలో రెండు రోజుల పర్యటన ఖరారైంది. కలెక్టర్‌ షన్మోహన్, ఎస్పీ మణికంఠ చందోలు శనివారం శాంతిపురం మండలంలో పర్యటించారు. జల్లిగానిపల్లె, చిన్నారిదొడ్డి గ్రామాల వద్ద హంద్రీ-నీవా కాలువను సీఎం పరిశీలించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, ఫొటో ఎగ్జిబిషన్‌పై అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టర్‌ షన్మోహన్‌ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. 

షెడ్యూల్‌ ఇలా.. 

  • 25న మధ్యాహ్నం 12.30: బెంగుళూరు నుంచి హెలికాప్టర్‌లో పీఈఎస్‌ వైద్య కళాశాలకు చేరుకుంటారు. 
  • 12:55: రోడ్డు మార్గంలో శాంతిపురం మండలం  జల్లిగానిపల్లె రాక, హంద్రీ-నీవా కాలువ పరిశీలన. 
  • 1:30: చిన్నారిదొడ్డిలో హెచ్‌ఎన్‌ఎన్‌ కాలువ పరిశీలన 
  • 2:10: కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి రాక 
  • 3:00: ఆర్టీసీ బస్టాండు సమీపంలో బహిరంగ సభ.  
  • 4:40 - 6:00: ఆర్‌అండ్‌బీ భవనంలో పార్టీ నేతలతో సమావేశం, రాత్రి బస.
  • 26న ఉదయం 10:30- 11:50: వినతుల స్వీకరణ. 
  • 12:00: డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్ష.
  • 2:40 - 4:00: పీఈఎస్‌ ఆడిటోరియంలో పార్టీ శ్రేణులతో సమావేశం. 
  • 4:10: హెలికాప్టర్‌లో తిరుగు పయనం. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని