logo

హోం మంత్రి కాన్వాయ్‌లో అపశ్రుతి

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని భాజపా తిరుపతి నాయకుడు ప్రభాకర్‌ నాయుడు గాయపడ్డారు.

Published : 23 Jun 2024 02:22 IST

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని భాజపా తిరుపతి నాయకుడు ప్రభాకర్‌ నాయుడు గాయపడ్డారు. తిరుమల పర్యటన నిమిత్తం వచ్చిన హోం మంత్రి అలిపిరి వద్ద గోపూజ నిమిత్తం ఆగారు. ఆ సమయంలో సన్మానం చేసేందుకు భాజపా నాయకులు కొందరు అక్కడికి చేరుకున్నారు. మంత్రి కాన్వాయ్‌ వద్దకు చేరుకునే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఓ కారు అతని ఎడమ కాలుపై ఎక్కి దిగింది. గాయపడ్డ ఆయన్ను వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కాలు విరిగినట్లు గుర్తించి చికిత్స అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని