logo

ఇసుకపై స్థానికేతరుల కన్ను

నాగలాపురం మండలంలోని సుబ్బానాయుడుకండ్రిగ ఇసుక నిల్వ కేంద్రంలోని ఇసుకపై స్థానికేతరుల కన్ను పడింది.

Published : 23 Jun 2024 02:26 IST

తెదేపా, జనసేన ఆందోళనతో అక్రమార్కుల పలాయనం 

ఇసుకను నిల్వ కేంద్రంలో పారబోస్తున్న టిప్పరు 

నాగలాపురం, న్యూస్‌టుడే: నాగలాపురం మండలంలోని సుబ్బానాయుడుకండ్రిగ ఇసుక నిల్వ కేంద్రంలోని ఇసుకపై స్థానికేతరుల కన్ను పడింది. పక్క జిల్లా నుంచి శనివారం ఉదయం హడావుడిగా వచ్చిన ఇసుకాసురులు ట్రాక్టరుకు రూ.3 వేలు, టిప్పరుకు రూ.20 వేలు చొప్పున వసూలు చేసి వాహనాల్లోకి హిటాచీ యంత్రాలతో ఇసుక నింపారు. విషయం బహిర్గతం కావడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు, తెదేపా, జనసేన నేతలు నిల్వ కేంద్రానికి చేరుకున్నారు. ఇసుక తరలించేందుకు వచ్చిన వ్యక్తులతో అధికారులు చర్చలు సాగించారు. తాము తెదేపా నేతలమంటూ చెప్పుకొచ్చిన వారు.. తమకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ బుకాయించారు. అనుమతి పత్రాలు చూపాలనడంతో దాటవేశారు. తెదేపా, జనసేన నాయకులు ఆందోళన చేయడంతో ఎస్సై ఓబయ్య ఉన్నతాధికారుల సూచనతో వాహనాల్లోని ఇసుకను నిల్వ కేంద్రంలోనే పారబోయించారు. వీరిపై రెవెన్యూ, పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలకు దారితీసింది. కొన్ని వాహనాలు ముందుగానే నిల్వ కేంద్రం నుంచి వెళ్లిపోయాయి. దీనిపై తహసీల్దార్‌ నరసింహులు మాట్లాడుతూ ఇక్కడి ఇసుక తరలించేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని