logo

నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

భారత ప్రభుత్వం నూతన చట్టాలు తీసుకురావడంతో పాటు.. కొన్ని చట్టాలకు పేర్లు మార్చిందని, నూతన చట్టాలపై అవగాహన పెంచుకుని, అందుకు అనుగుణంగా జాగ్రత్తగా తీర్పులు వెలువరించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు.

Published : 23 Jun 2024 02:38 IST

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, హాజరైన ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులు  

చిత్తూరు(న్యాయవిభాగం): భారత ప్రభుత్వం నూతన చట్టాలు తీసుకురావడంతో పాటు.. కొన్ని చట్టాలకు పేర్లు మార్చిందని, నూతన చట్టాలపై అవగాహన పెంచుకుని, అందుకు అనుగుణంగా జాగ్రత్తగా తీర్పులు వెలువరించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని న్యాయాధికారులకు కొత్తగా రూపొందించిన క్రిమినల్‌ లా, సివిల్‌ కేసులు, పరిపాలనాపరమైన పలు అంశాలపై చేపట్టిన రెండ్రోజుల కార్యశాల శనివారం ప్రారంభమైంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ భారతీయ న్యాయశాఖ చట్టం-2023 పూర్వం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌-1860గా ఉండేదన్నారు. ఈ చట్టంలో పలు మార్పులు, శిక్షా కాలంతో పాటు జరిమానా పెంచారన్నారు. భారతీయ న్యాయ సంహిత-2023 చట్టం  జులై 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. లా ప్రొఫెసర్లు డాక్టర్‌ కేవీకే శాంతి, డాక్టర్‌ డి.శంకర్‌.. కొత్త చట్టాలపై సందేహాలు నివృత్తి చేశారు. మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్, పోక్సో జిల్లా కోర్టు న్యాయమూర్తి శాంతి, రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అబ్రహం, మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గురునాథ్, నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అర్చన, ఐదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రామ్మోహన్‌రావు, ఎనిమిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి, పదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రామచంద్రుడు, 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసనాయక్, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు