logo

సర్వే కోసం వెళ్తే దాడి

తమ పొలం సర్వే కోసం చలానా కట్టి సచివాలయానికి వెళితే సిబ్బంది దాడి చేసి గెంటి వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 23 Jun 2024 02:40 IST

గెంటివేసిన సచివాలయ సిబ్బంది
ఫిర్యాదు తీసుకోని పోలీసులు

ఏతూరు సచివాలయం ముందు నిలుచున్న బాధితులు కౌశల్య, లక్ష్మీపతి దంపతులు 

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: తమ పొలం సర్వే కోసం చలానా కట్టి సచివాలయానికి వెళితే సిబ్బంది దాడి చేసి గెంటి వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఏతూరు పంచాయతీ సచివాలయంలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకొంది. బాధితులు తెలిపిన వివరాలు మేరకు.. కొత్తపల్లె గ్రామానికి చెందిన సీతారామయ్య 50 ఏళ్లుగా సర్వే నెంబరు 248-6లో 43 సెంట్లు భూమిని సాగు చేస్తున్నారు. వయస్సు పైబడడంతో తన కుమార్తె ధనలక్ష్మికి వీలునామా రాసి రిజిష్టర్‌ చేశారు. భూమికి సంబంధించి పట్టా పాసు పుస్తకం, 1బి, పట్టా ఉంది. అయితే గత ప్రభుత్వంలో సుబ్బిరెడ్డి అనే రైతు ధనలక్ష్మి చేతి వేలిముద్రలు వేయించుకుని దౌర్జన్యంగా పొలాన్ని ఆక్రమించుకుని, భవన నిర్మాణాలు చేపడుతున్నాడు. సీతారామయ్య మనవరాలు కౌసల్య ఆమె భర్త లక్ష్మీపతి ఆ పొలంపై కోర్టులో స్టే, ఇంజక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు. తన పలుకు బడితో అవేమి పట్టించుకోని సుబ్బిరెడ్డి నిర్మాణాలు ఆపలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం కౌసల్య, లక్ష్మీపతి దంపతులు స్థానిక తహసీల్దారుకు ఈ విషయమై ఫిర్యాదు చేయగా సచివాలయానికి వెళ్లి సర్వేకు కట్టండని సూచించారు. బాధితులు సర్వే చాలానా ఇచ్చేందుకు ఏతూరు సచివాలయానికి వెళితే విధుల్లో ఉన్న నిరంజన్‌రెడ్డి... సుబ్బిరెడ్డి బంధువులు కావడంతో అడ్డుపడి సచివాలయం నుంచి బయటకు గెంటి వేసి దౌర్జన్యం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళితే అక్కడ సీఐ లేరని వచ్చిన తరువాత కేసు తీసుకుంటామని పంపివేశారని బాధితులు వాపోయారు. ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా తమకు న్యాయం జరగడంలేదని తమకు న్యాయం చేయాలని బాధితులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని