logo

కాణిపాకం ఆలయంలో ప్రక్షాళన చేపట్టాలి

వైకాపా పాలనలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో చాలా అవకతవకలు జరిగాయని, వాటిని గుర్తించి ప్రక్షాళన చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని సీఎం చంద్రబాబునాయుడు..

Published : 23 Jun 2024 02:41 IST

సీఎం చంద్రబాబుకు స్వామివారి జ్ఞాపిక అందజేస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్‌ 

కాణిపాకం: వైకాపా పాలనలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో చాలా అవకతవకలు జరిగాయని, వాటిని గుర్తించి ప్రక్షాళన చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని సీఎం చంద్రబాబునాయుడు.. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ కలికిరి మురళీమోహన్‌కు సూచించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో సీఎం, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను వేర్వేరుగా కలిసి వరసిద్ధుడి పట్టువస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికలు శనివారం అందించి ఆలయ వేదపండితులు ఆశీర్వదించారు. ఈవో ఎ.వెంకటేశు, మాజీ ఛైర్మన్‌ మణినాయుడు, మండల తెదేపా అధ్యక్షుడు వడ్లపాటి గిరిధర్‌బాబు, తెలుగు రైతు జిల్లా ఉపాధ్యక్షుడు గంగారపు హరిబాబునాయుడు, కాణిపాకం మాజీ సర్పంచి కె.మధుసూధన్‌రావు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర చౌదరి, బంగారుపాళ్యం పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌నాయుడు, నాయకులు హేమాద్రినాయుడు, మోహన్‌నాయుడు, ఎన్‌పీ జయచంద్రనాయుడు, నరసింహులునాయుడు, ఐటీఫోరం సభ్యులు మోహన్, సొప్పానాని సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు