logo

నూతన కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌

నూతన కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్‌ షన్మోహన్‌ను కాకినాడ కలెక్టర్‌గా బదిలీ చేశారు.

Published : 23 Jun 2024 02:43 IST

కాకినాడకు షన్మోహన్‌ బదిలీ

సుమిత్‌కుమార్‌

ఈనాడు, చిత్తూరు: నూతన కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్‌ షన్మోహన్‌ను కాకినాడ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన గతేడాది ఏప్రిల్‌ 10న బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో కీలకమైన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగడంలో షన్మోహన్‌ ముఖ్య భూమిక పోషించారు.
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇక్కడికి.. కొత్తగా నియమితులైన సుమిత్‌కుమార్‌ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పశ్చిమ గోదావరి కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఆయన తొలుత నరసాపురం సబ్‌ కలెక్టర్‌గా, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జేసీగా, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా అంతకు ముందు బాధ్యతలు చేపట్టారు. హరియాణ రాష్ట్రంలోని రోహోతక్‌ ఈయన స్వస్థలం. రెండో ప్రయత్నంలో ఐఏఎస్‌కు ఎంపిక అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని