logo

ఐఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అనస్థీషియా(ఐఎస్‌ఏ) 2024-27 కార్యవర్గ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ శ్రీనివాసరావు సూరిశెట్టిని ఎన్నుకున్నారు.

Published : 24 Jun 2024 01:50 IST

సమావేశంలో పాల్గొన్న వైద్యులు

తిరుపతి (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అనస్థీషియా(ఐఎస్‌ఏ) 2024-27 కార్యవర్గ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ శ్రీనివాసరావు సూరిశెట్టిని ఎన్నుకున్నారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఐఎస్‌ఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సెప్టెంబరు నెలలో స్థానిక శ్రీ కన్వెన్షన్‌ హాల్‌లో ఐఎస్‌ఏ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యదర్శిగా మదన్‌మోహన్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ సూరినేనిని ఎన్నుకున్నారు. ఐఎస్‌ఏలోని ప్రధాన మూడు పోస్టులు తిరుపతికి చెందిన వైద్యులకు దక్కాయి. జాతీయ పూర్వ అధ్యక్షులు కామేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తారక్‌ ప్రసాద్, అచ్యుత్‌ రామయ్య, కోశాధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని