logo

ఓసారి ఇటు చూడు వేంకటేశా..?

నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వచ్చే కాణిపాకం ఆలయానికి భద్రత కరవైంది.

Published : 24 Jun 2024 01:53 IST

ఆలయ సమీపంలో నిలిపిన వాహనాలు

నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వచ్చే కాణిపాకం ఆలయానికి భద్రత కరవైంది. సాధారణంగా ఆలయానికి సమీపంలో ఎలాంటి వాహనాలు పార్కింగ్‌ చేయకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే వీటిని అధికారులు గాలికొదిలేశారు. ఇందుకు నిదర్శనం.. ఆదివారం ఆలయానికి అత్యంత సమీపానే వాహనాలు పార్కింగ్‌ చేయడం. భక్తులు తమ వాహనాలు ఇష్టానుసారంగా అక్కడే నిలుపుతున్నా.. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది తమకేమీపట్టనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఆలయ ఉన్నతాధికారి సైతం ఆలయ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని మిగిలిన భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇలా వాహనాలు అడ్డదిడ్డంగా ఆపితే ఎలాఅని అంటున్నారు. ఆలయం వద్ద కనీస నిబంధనలు పాటించాలి కదా అని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆలయానికి, వచ్చే భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.   

న్యూస్‌టుడే, కాణిపాకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని